హను మాన్ చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ దర్శకుడు కి హను మాన్ తో వచ్చిన సక్సెస్ మరిన్ని అవకాశాల్ని తీసుకొస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరో అయిన నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ను తదుపరి డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. తాజాగా ఈ దర్శకుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేశాడు.
సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంద్ర చిత్రానికి సమరసింహ రెడ్డి ఇన్స్పిరేషన్ అని తెలిపారు చిరు. ఇప్పుడు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ నడుస్తున్నాయి కాబట్టి, ఎవరైనా డైరెక్టర్ వచ్చి ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమరసింహా రెడ్డి అని వస్తే నేను రెడీ అని తెలుపగా, బాలయ్య కూడా రెడీ అని అన్నారు. ఈ మేరకు చిరు ఛాలెంజ్ విసిరారు. చాలా మంది దర్శకులు ఉన్నారు. ఎవరి నుండి ఎలాంటి ఐడియాస్ వస్తాయో చూడాలి అని అన్నారు.
అయితే ప్రశాంత్ వర్మ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ చేసిన పోస్ట్ చిరు కామెంట్స్ పై రెస్పాన్స్ అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రశాంత్ వర్మ నిజంగానే వీరిద్దరి కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తే, ఇక ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
— Prasanth Varma (@PrasanthVarma) September 2, 2024