పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా నుంచి ఇప్పుడు ఒకో అప్డేట్ ఫ్యాన్స్ ని అలరించేందుకు వస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే.
మరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మూలాన పలు ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. దీనితో తెలుగు సినిమా నుంచి ప్రముఖులు విరాళాలు అందించడం కూడా స్టార్ట్ చేశారు. మరి దీనిపై తాజాగా దేవర ఎన్టీఆర్ తన వంతుగా భారీ మొత్తంలో కోటి రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల ముప్పు తనని ఎంతగానో కలచివేసింది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో 50 లక్షల రూపాయలు విరాళంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వ సహాయ నిధులకి అందిస్తున్నాను అని తెలియజేసాడు. దీనితో తారక్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు అని చెప్పాలి. ఇక తన దేవర నుంచి రేపు మూడో సాంగ్ రిలీజ్ కి రాబోతుండగా ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024