100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న నాని “సరిపోదా శనివారం”

100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్న నాని “సరిపోదా శనివారం”

Published on Sep 3, 2024 9:42 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 75.26 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ వీకెండ్ వరకూ ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు