రిలీజ్ డేట్‌తో పాటు మోషన్ పోస్టర్‌తో వస్తున్న ‘జీబ్రా’

రిలీజ్ డేట్‌తో పాటు మోషన్ పోస్టర్‌తో వస్తున్న ‘జీబ్రా’

Published on Sep 16, 2024 10:05 PM IST

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఆయన నటించే సినిమాల్లో ఆయన పాత్ర ప్రేక్షకులపై మంచి ఇంప్రెషన్ వేస్తుంది. ఇలా తన నటనతో ఆయన చేసే సినిమాలకు గుర్తింపు తీసుకొచ్చారు ఈ యాక్టర్. ఇక సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 17న ఉదయం 11.31 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు వారు తెలిపారు.

ఈ సినిమాలో సత్యదేవ్‌తో పాటు ధనంజయ, ప్రియ భవానీ శంకర్, అమృత అయ్యంగార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు