ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక.. వీరే విజేతలు

ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక.. వీరే విజేతలు

Published on Sep 16, 2024 9:53 PM IST

ప్రస్తుతం అవార్డుల సీజన్ నడుస్తోంది. సైమా, జాతీయ అవార్డుల వేడుకలు జరుగుతున్న వేళ, మరో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కూడా ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 76వ ఎమ్మీ అవార్డుల వేడుక గురించే ఈ వార్త. లాస్‌ ఏంజెలెస్‌(యూఎస్‌)లోని పికాక్‌ థియేటర్‌ ఈ సినీ పండగకు వేదిక అవ్వడం విశేషం. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేసి అలరించారు.

కాగా ఈ అవార్డుల బరిలో ఎన్నో సినిమాలు నామినేషన్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అత్యధికంగా డ్రామా విభాగంలో ‘షోగన్’ 25 నామినేషన్స్‌, కామెడీ విభాగంలో ‘ది బేర్’ 23 నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. మరి వీరిలో విజేతలుగా నిలిచిన వారెవరో చూద్దాం రండి.

కామెడీ సిరీస్‌ ఉత్తమ నటి (కామెడీ) – జీన్‌ స్మార్ట్‌ (హ్యాక్స్‌)

కామెడీ సిరీస్‌ బెస్ట్‌ యాక్టర్‌ (కామెడీ) – జెరెమీ అలెన్‌ వైట్‌ ( దిబేర్‌)

ఉత్తమ సహాయ నటుడు(కామెడీ) – ఎబోన్‌ మోస్‌ (ది బేర్‌)

ఉత్తమ సహాయ నటి (కామెడీ) – లిజా కోలోన్‌ (ది బేర్‌)

ఉత్తమ సహాయ నటుడు (డ్రామా) – బిల్లీ క్రుడప్‌ ( ది మార్నింగ్‌ షో)

ఉత్తమ సహాయ నటి (డ్రామా) – ఎలిజబెత్‌ డెబికి ( దిక్రౌన్‌)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు