చెన్నైలో ‘దేవర’ ఆడియో లాంచ్.. ఎప్పుడంటే?

చెన్నైలో ‘దేవర’ ఆడియో లాంచ్.. ఎప్పుడంటే?

Published on Sep 17, 2024 3:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది.

కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘దేవర’ ప్రమోషన్స్ షురూ చేయగా, ఇప్పుడు తమిళంలో కూడా ఈ చిత్ర ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకను చెన్నైలో నిర్వహించేందుకు ‘దేవర’ యూనిట్ రెడీ అయ్యింది. సెప్టెంబర్ 17న సాయంత్రం ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు