“వీరమల్లు” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

“వీరమల్లు” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 17, 2024 8:07 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఎప్పుడు నుంచో తెరకెక్కుతూ వెళ్తున్న ఈ సినిమా దాదాపు నాలుగేళ్ళ నుంచి షూటింగ్ దశలోనే ఉంది. ఇక మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలినీ సమయంలో అయితే ఫైనల్ గా ఇప్పుడు అంతా సెట్ అయ్యింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సెప్టెంబర్ 23 నుంచి వీరమల్లు సెట్స్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ నుంచి అక్టోబర్ 5 వరకు అలా వీరమల్లు షూటింగ్ ని కొనసాగిస్తాడట. దీనితో పవన్ పోర్షన్ ఈ సినిమాకి అయిపోయినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు