ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “35 చిన్న కథ కాదు”?

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “35 చిన్న కథ కాదు”?

Published on Sep 17, 2024 4:12 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేతా థామస్ హీరోయిన్ గా యువ నటుడు విశ్వదేవ్ రాచకొండ తెరకెక్కించిన చిత్రం “35 చిన్న కథ కాదు” మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం చాలా కాలం తర్వాత తెలుగు ఆడియెన్స్ కి మంచి తెలుగు సినిమా చూసాం అనే భావన కలిగించి అందరి మనసు దోచుకుంది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం కానున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రంతో ఈ సెప్టెంబర్ 27న రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా సురేస్గ్ ప్రొడక్షన్స్ వారి సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు