ఇండస్ట్రీ కోసం అయినా ఈ 3 పెద్ద సినిమాలు హిట్టవ్వాల్సిందే!

ఇండస్ట్రీ కోసం అయినా ఈ 3 పెద్ద సినిమాలు హిట్టవ్వాల్సిందే!

Published on Sep 17, 2024 7:05 PM IST


ప్రస్తుతం థియేట్రికల్ గా అన్ని సినీ వర్గాల్లో కూడా పరిస్థితులు ఎలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు థియేటర్స్ లో జనం తండోపతండాలుగా క్యూలు కట్టేవారు. కానీ మారుతున్న కాలంతో జనం కూడా మారారు. దీనితో థియేట్రికల్ గా అన్ని సినిమాలని చూసేందుకు ఆసక్తి చూపించడంలేదు. ప్రస్తుతం థియేటర్స్ లోకి పెద్ద సినిమాలు వస్తే తప్ప జనం థియేటర్స్ లోకి వచ్చే పరిస్థితి కనపడడం లేదు.

రీసెంట్ గా “కల్కి 2898 ఎడి” రిలీజ్ అయ్యాక దానికి ముందు కూడా జనం థియేటర్స్ కి బాగా వెళ్లిన సినిమా ఏది అంటే చాలా మంది దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. అయితే దీనికి ఓటిటి, సినిమాలు చూడకుండానే సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసే బ్యాచ్ వంటి ఇతరాత్ర కారణాలు కూడా లేకపోలేవు.

దీనితో నిర్మాతలు, టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సైతం థియేటర్స్ కి ప్రేక్షకులు రండి అంటూ విన్నవించుకుంటున్నారు. అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఇప్పుడు పెద్ద సినిమాలు పడకపోతే జనం థియేటర్స్ లోకి రావడానికి అంత ఆసక్తి చూపడం లేదు. దీనితో చాలా వరకు సింగిల్ స్క్రీన్స్, పలు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా నష్టాలు పోతున్నారు.

అంతెందుకు ఈ మధ్య కాలంలో పలు సింగిల్ స్క్రీన్స్ సరైన సినిమాలు లేక చూసే జనం లేక మూసేసినవి కూడా ఉన్నాయి. దీనితో టైం టు టైం స్టార్ హీరోస్ సినిమాలు రావాల్సిన అవసరం తప్పక ఉందని చెప్పాలి. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోస్ మూడేళ్ళకి నాలుగేళ్లకు ఒకో సినిమా చేస్తే మరికొందరు ఏడాది రెండేళ్లలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. మరి ఇలా ఎప్పటికప్పుడు పెద్ద సినిమాలు పడితే ఫ్యాన్స్ తో పాటుగా జెనరల్ ఆడియెన్స్ కూడా థియేటర్స్ కి వస్తారు.

సో అక్కడ థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గట్టెక్కే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న మూడు భారీ సినిమాలపైనే అందరి కళ్ళు ఉన్నాయి. మరి ఆ చిత్రాలే ఈ సెప్టెంబర్ లో రానున్న భారీ పాన్ ఇండియా చిత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన “దేవర” (Jr NTR Devara) అలాగే డిసెంబర్ లో రానున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” (Pushpa 2) ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” (Game Changer) సినిమాలు అని చెప్పాలి.

మరి వరుసగా ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇవి హిట్ అయ్యి కాస్త రెవెన్యూ జెనరేట్ అయితే తప్ప ఈ మధ్య కాలంలో వచ్చిన నష్టాల నుంచి ఎగ్జిబిటర్స్ బయట పడే అవకాశం ఉంటుంది అంతే కాకుండా కొత్త డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిటర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అలాగే నిర్మాతలకి కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది అని చెప్పాలి.

సో ఇండస్ట్రీ కొంచెం అయినా మళ్ళీ పురోగతి చెందాలి అంటే ఈ మూడు భారీ చిత్రాలు హిట్ కావాల్సిందే అని చెప్పాలి. మరి ఈ మూడు సినిమాల అవుట్ పుట్ పై కూడా మేకర్స్ కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు. మరి ఈ ఏడాదిలో వచ్చే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు