ఎఆర్‌యమ్ సాలిడ్ వసూళ్లు.. 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

ఎఆర్‌యమ్ సాలిడ్ వసూళ్లు.. 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

Published on Sep 17, 2024 11:58 PM IST

మలయాళ నటుడు టొవినో థామస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఎఆర్‌యమ్ ఆయన కెరీర్‌లో 50వ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. జితిన్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెలుగులోనూ మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించడంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాపై ఆసక్తిని చూపారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు పూర్తయ్యే సరికి సాలిడ్ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమా 5 రోజుల్లో ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ధిబూ నీనన్ థామస్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు