టాక్..”తండేల్” రిలీజ్ డేట్ మారిందా?

టాక్..”తండేల్” రిలీజ్ డేట్ మారిందా?

Published on Sep 18, 2024 5:00 PM IST

అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అయినటువంటి అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రం “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చైతు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా రాబోతుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ ని మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ లో 20వ తేదికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఈ రేస్ నుంచి తండేల్ తప్పుకునే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ గా ఆ నెక్స్ట్ ఏడాది 2025 జనవరి 13 కి సినిమా మారినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై సరైన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఆల్రెడీ డిసెంబర్ 20 డేట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్, హాలీవుడ్ నుంచి ముఫాసా (Mufasa) లాంటి అవైటెడ్ సినిమాలు ఉన్నాయి. మరి తండేల్ ఈ డేట్ లో వస్తుందో లేక సంక్రాంతి బరిలోకి వెళ్లిందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు