లారెన్స్‌ను ఢీకొట్టేందుకు వస్తున్న ‘యానిమల్’ విలన్

లారెన్స్‌ను ఢీకొట్టేందుకు వస్తున్న ‘యానిమల్’ విలన్

Published on Sep 18, 2024 7:10 PM IST

యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన కెరీర్‌లోని 25వ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రమేశ్ వర్మ డైరెక్షన్‌లో లారెన్స్ ఈ సినిమాలో నటించనున్నాడు. ఇదొక బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రానుందని మేకర్స్ తెలిపారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ విలన్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ ‘యానిమల్’లో విలన్‌గా తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న నటుడు బాబీ డియోల్, రాఘవ లారెన్స్ నటించబోయే సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించాల్సిందిగా చిత్ర బృందం ఆయన్ను సంప్రదించిందని.. దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చిత్ర వర్గాల్లో టాక్.

ఇక ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కిల్’కి ఇది రీమేక్‌గా రానుందనే ప్రచారం సాగుతోంది. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు