Devara: ‘ఆయుధ పూజ’ సాంగ్ వాయిదా!

Devara: ‘ఆయుధ పూజ’ సాంగ్ వాయిదా!

Published on Sep 18, 2024 8:09 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ మూవ ‘దేవర’(Devara) నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అనిరుధ్ సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోనే బెస్ట్ సాంగ్‌గా హైప్ క్రియేట్ చేశారు ‘ఆయుధ పూజ’ పాటకు. ఈ సాంగ్‌ను సెప్టెంబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు ‘దేవర’ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు అభిమానులకు ‘దేవర’ యూనిట్ షాక్ ఇచ్చింది. ఈ సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రిలీజ్ డేట్ ఇచ్చాక కూడా ఇలా పాటను వాయిదా వేయడం ఏమిటని వారు నెట్టింట ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ పాటను సరైన సమయంలో రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ పవర్‌ఫుల్ యాక్షన్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ల పర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు