“దసరా”కి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది.. దర్శకుడు ఓ రేంజ్ కాన్ఫిడెన్స్

“దసరా”కి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది.. దర్శకుడు ఓ రేంజ్ కాన్ఫిడెన్స్

Published on Sep 19, 2024 8:01 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన చిత్రాల్లో పలు క్లాస్ చిత్రాలూ ఉన్నాయి అలాగే మాస్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్స్ “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) అలాగే దీనికి ముందు చేసిన “దసరా” సినిమాలు అని చెప్పవచ్చు. అయితే దసరా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నానితో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం కోసం తాను పెట్టిన ఓ సాలిడ్ పోస్ట్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరిచింది. 2023 మార్చ్ 7న నా మొదటి సినిమా “దసరా” కి చివరిగా చెప్పిన మాట “కట్ షాట్ ఓకే”. ఇప్పుడు మళ్ళీ 2024 సెప్టెంబర్ 18న నానితో రెండో సినిమా అనౌన్సమెంట్ వీడియోకి యాక్షన్ చెప్పాను.

ఇది చెప్పడానికి నాకు 4 కోట్ల 84 లక్షల 400 సెకండ్లు పట్టింది. ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ సినిమా దసరా కి 100 రెట్లు మించి ఉండబోతుంది అంటూ సాలిడ్ పోస్ట్ చేసాడు. దీనితో ఈ సినిమా విషయంలో తాను ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు అనేది మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ ఇద్దరి కలయికలో వచ్చే రెండో సినిమా ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు