VD 12: విజయ్ దేవరకొండ మాస్ ప్రాజెక్ట్ టైటిల్ అప్పుడేనా?

VD 12: విజయ్ దేవరకొండ మాస్ ప్రాజెక్ట్ టైటిల్ అప్పుడేనా?

Published on Sep 19, 2024 5:00 PM IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో విజయ్ ప్రిపేర్ చేసిన షాకింగ్ లుక్ అయితే ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసింది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ వెంటనే రిలీజ్ చేసేసి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చారు. అయితే ఈ చిత్రం తాలూకా టైటిల్ ఏంటి అనేది మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు.

దీనిని కూడా రివీల్ చేస్తాం అని ప్రామిస్ చేశారు. కానీ దీనిపై తర్వాత ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ టైటిల్ అనౌన్స్మెంట్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా అవైటెడ్ టైటిల్ ని దసరా కానుకగా రివీల్ చేయనున్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు