Prabhas: రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’!

Prabhas: రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’!

Published on Sep 19, 2024 7:14 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా ‘కల్కి 2898 AD’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా విజయం తరువాత ఆయన ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, మరో ప్రాజెక్టును కూడా ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, అక్టోబర్‌లో ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అభిమానులకు ఓ సాలిడ్ అప్డేట్ లభించింది.

ప్రభాస్ కెరీర్‌లో మంచి హిట్ చిత్రంగా నిలిచిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీని ప్రభాస్ బర్త్‌డే కానుకగా రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజు కావడంతో, ఇప్పుడు అఫీషియల్‌గా ఈ అనౌన్స్‌మెంట్ వచ్చింది. వింటేజ్ డార్లింగ్ ప్రభాస్‌ను ఈ సినిమాతో మరోసారి చూద్దాం అని మేకర్స్ తెలిపారు. అక్టోబర్ 22న ఈ సినిమా రీ-రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు.

2001లో వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ రొమాంటిక్ డ్రామా మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటంది. ఈ సినిమాలో అందాల భామలు కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు రీ-రిలీజ్‌తో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు