Devara: “దేవర” ప్రీరిలీజ్ కి ఆ ముగ్గురు టాప్ దర్శకులు?

Devara: “దేవర” ప్రీరిలీజ్ కి ఆ ముగ్గురు టాప్ దర్శకులు?

Published on Sep 20, 2024 8:03 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగులో ఈ సెప్టెంబర్ 22న చేస్తున్నట్టుగా డేట్ ని కూడా ఇచ్చేసారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ పై మరో సాలిడ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముగ్గురు టాప్ దర్శకులు రాబోతున్నారట.

మరి వారెవరో కాదు తారక్ తో వర్క్ చేసిన వర్క్ చేయనున్న సెన్సేషనల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లు అని తెలుస్తుంది. మరి ఈ అందరి కలయిలో అంటే ఈవెంట్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ అవైటెడ్ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు