Anushka: అనుష్క “ఘాటీ” పై లేటెస్ట్ అప్డేట్.!

Anushka: అనుష్క “ఘాటీ” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 20, 2024 11:02 AM IST

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. మరి బాహుబలి లాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత అనుష్క తనదైన మార్క్ లో సినిమాలు చేస్తూ వెళుతుంది. మరి గత ఏడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో చేసిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాతో మంచి కం బ్యాక్ ని ఆమె అందుకోగా ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న చిత్రం “ఘాటీ” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం కొన్నాళ్ల కితమే షూటింగ్ మొదలు పెట్టుకోగా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి లేటెస్ట్ గా అనుష్క హైదరాబాద్ లో ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్టింగ్స్ లో షూట్ కి జాయిన్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో అనుష్కపై పలు ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ ని తెరకెక్కించనున్నారట. మరి “వేదం” తర్వాత అనుష్కతో క్రిష్ చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు