లేటెస్ట్: పవన్ పై అదిరే స్టిల్ తో “వీరమల్లు” షూట్ అప్డేట్ వచ్చేసింది

లేటెస్ట్: పవన్ పై అదిరే స్టిల్ తో “వీరమల్లు” షూట్ అప్డేట్ వచ్చేసింది

Published on Sep 20, 2024 2:06 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ నుంచి మొదలైన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ రోల్ లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం పవన్ కళ్యాణ్ ని రీసెంట్ గానే కలవడం షూటింగ్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తామని వారు తెలిపారు. అయితే ఇప్పుడు మేకర్స్ పవన్ పై సినిమా నుంచి ఒక పవర్ఫుల్ స్టిల్ ని రిలీజ్ చేసి సినిమా షూటింగ్ లో పవన్ మళ్ళీ ఈ సెప్టెంబర్ 23 నుంచో జాయిన్ కాబోతున్నట్టు బిగ్ అప్డేట్ ఫ్యాన్స్ కి అందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. మరి ఇది పూర్తి చేసుకొనే ఈ ఏడాదిలోనే రిలీజ్ వస్తుందా లేక వచ్చే ఏడాదికి వెళుతుందా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు