భారీ ధరకి సందీప్ కిషన్, ‘ధమాకా’ దర్శకుడు ప్రాజెక్ట్ నాన్ థియేట్రికల్ హక్కులు

భారీ ధరకి సందీప్ కిషన్, ‘ధమాకా’ దర్శకుడు ప్రాజెక్ట్ నాన్ థియేట్రికల్ హక్కులు

Published on Sep 20, 2024 5:05 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ గానే కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం “రాయన్” లో సాలిడ్ రోల్ లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంతో పాటుగా తెలుగులో సూపర్ హిట్స్ దర్శకుడు రీసెంట్ గా “ధమాకా” తో భారీ హిట్ కొట్టిన త్రినాథరావు నక్కినతో సాలిడ్ ఎంటర్టైనర్ ని తాను చేస్తున్నాడు. మరి ఈ సినిమాపై కూడా మంచి బజ్ నెలకొనగా ఈ సినిమాకి అదిరే బిజినెస్ అప్పుడే జరిగిపోయినట్టుగా తెలుస్తుంది.

నాన్ థియేట్రికల్ హక్కులుగా ఈ చిత్రానికి నన థియేట్రికల్ హక్కులుగా మొత్తం 23 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. ఆడియో హక్కులు రెండున్నర కోట్లకి ఆడియో హక్కులు, హిందీ డబ్బింగ్ కి నాలుగున్నర కోట్లు, అలాగే శాటిలైట్, డిజిటల్ హక్కులుకి గాను 15 కోట్లు పలికిందట. ఇలా ఈ చిత్రం నన థియేట్రికల్ గానే భారీ మొత్తంలో సాలిడ్ బిజినెస్ ని చేసేసింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు