Game Changer: “గేమ్ ఛేంజర్” రెండో సాంగ్ డేట్ ఇదేనా?

Game Changer: “గేమ్ ఛేంజర్” రెండో సాంగ్ డేట్ ఇదేనా?

Published on Sep 21, 2024 10:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి ఇక వరుస అప్డేట్స్ ఉంటాయని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేసేసారు. అయితే ఈ సెప్టెంబర్ లోనే రెండో సాంగ్ ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కానీ నెలలో సగం రోజులు అయిపోయినప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

అయితే రీసెంట్ గానే థమన్ నెక్స్ట్ వీక్ లో సాంగ్ రిలీజ్ ఉంటుంది అని తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ డేట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సాంగ్ ఈ సెప్టెంబర్ 27న అలా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే దానికి ఓ రెండు లేదా మూడు రోజులు ముందు ప్రోమోని విడుదల చేయనున్నారట. మరి ఈ సాంగ్ కోసం అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఈ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు