ఫోటో మూమెంట్: దుల్కర్ సల్మాన్‌తో దేవర.. కేరళలో మాస్ వేవ్!

ఫోటో మూమెంట్: దుల్కర్ సల్మాన్‌తో దేవర.. కేరళలో మాస్ వేవ్!

Published on Sep 21, 2024 8:17 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ సెన్సేషన్‌కి మరో 6 రోజులు మాత్రమే ఉంది. దీంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించగా, పాన్ ఇండియా మూవీగా ఇది భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

అయితే, ఈ సినిమాను కేరళలోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర కేరళ రైట్స్‌ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫారర్ ఫిల్మ్స్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు తాజాగా ఎన్టీఆర్‌ను కలిసారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 27న కేరళలో ఓ కొత్త చరిత్ర ఖాయం అని వారు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘దేవర’ లాంటి బిగ్గెస్ట్ మాస్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు