Adivi Sesh: 2025లో మూడు రిలీజ్‌లు ఫిక్స్ చేసిన శేష్

Adivi Sesh: 2025లో మూడు రిలీజ్‌లు ఫిక్స్ చేసిన శేష్

Published on Sep 22, 2024 12:11 AM IST

టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ సక్సెస్ సాధిస్తున్న హీరో అడివి శేష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన రెండు సినిమాలను అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు వాటి షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశాడు. అయితే, ఈ హీరో తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశాడు.

2025 సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు అడివి శేష్ తెలిపాడు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడివి శేష్ వంటి యాక్టర్ నుంచి ఇలా ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు వస్తున్నాయంటే సినీ వర్గాల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఈ మూడు సినిమాలు ఏమిటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇక అడివి శేష్ ఇప్పటికే ‘గూఢచారి 2’ చిత్రంలో నటిస్తుండగా, ఆయన మరో సినిమాగా ‘డెకాయిట్’ రానుంది. వీటితో పాటు అడివి శేస్ ‘హిట్-3’లో కూడా ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. మరి అడివి శేష్ నుంచి రాబోయే మూడు రిలీజ్‌లు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు