బిగ్ అప్ డేట్ కి రెడీ అయిన ‘గేమ్ ఛేంజర్’ !

బిగ్ అప్ డేట్ కి రెడీ అయిన ‘గేమ్ ఛేంజర్’ !

Published on Sep 22, 2024 2:06 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ పొలిటికల్ డ్రామా, ప్రస్తుతం ఓ ప్రధాన ప్రకటన కోసం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఉత్తేజకరమైన అప్‌డేట్‌ తో త్వరలో రాబోతున్నామని స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదల తేదీకి (డిసెంబర్ 20, 2024న) సంబంధించిన అధికారిక అప్ డేట్ తో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ విడుదల తేదీని కూడా ఈ అప్‌ డేట్‌ లో చేర్చవచ్చని తెలుస్తోంది.

కాగా ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు