‘హరిహర వీరమల్లు’ కోసం కత్తి పట్టిన పవన్

‘హరిహర వీరమల్లు’ కోసం కత్తి పట్టిన పవన్

Published on Sep 23, 2024 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా పవన్.. ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్‌కి తిరిగి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈరోజు ఉదయం 7 గంటలకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను పవన్ ప్రారంభించినట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. మార్చి 28, 2025న పాన్ ఇండియా సినిమాగా ‘హరిహర వీరమల్లు’ ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల కానుంది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ‘పవన్ కళ్యాణ్’ కత్తి పట్టుకుని ఉన్న లుక్ అభిమానులను థ్రిల్ చేస్తుంది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు