Devara: నైజాంలోనూ ‘దేవర’ టికెట్ రేట్ల పెంపు.. ఫస్డ్ డే 7 షోలు!

Devara: నైజాంలోనూ ‘దేవర’ టికెట్ రేట్ల పెంపు.. ఫస్డ్ డే 7 షోలు!

Published on Sep 23, 2024 8:01 PM IST

‘దేవర’ మూవీకి ప్రస్తుతం ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో ‘దేవర’ చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ‘దేవర’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.

తొలిరోజున మిడ్‌నైట్ షోతో పాటు మరో 6 షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రెండో రోజు నుంచి 5 షోలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే తొలి రోజు టికెట్ రేట్లు రూ.100 పెంచుకోవచ్చని.. రెండో రోజు నుంచి సింగిల్ స్క్రీన్‌లో రూ.25, మల్టీప్లెక్స్‌లో రూ.50 పెంచుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.

దీంతో సింగిల్ స్క్రీన్స్‌లో దేవర చిత్ర టికెట్ ధర తొలి రోజు రూ.295, రెండో రోజు నుంచి రూ.206.5 గా ఉండనుంది. అటు మల్టీప్లెక్స్‌లలో తొలి రోజు రూ.413గా.. రెండో రోజు నుంచి రూ.354 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. ఇక ఈ నిర్ణయంతో ‘దేవర’ మూవీ కలెక్షన్స్ భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు