చిరు, కొరటాల విభేదాలు.. క్లారిటీ ఇచ్చేసిన “దేవర” డైరెక్టర్

చిరు, కొరటాల విభేదాలు.. క్లారిటీ ఇచ్చేసిన “దేవర” డైరెక్టర్

Published on Sep 24, 2024 12:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి ముందు చిరు నుంచి వచ్చిన ప్లాప్స్ లో “ఆచార్య” కోసం కూడా ఈ మధ్య చర్చ నడిచింది.

అయితే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివకి చిరంజీవికి నడుమ అప్పటి నుంచి చిన్నపాటి కోల్డ్ వార్ ఉందని ఆ సినిమా ఫలితం విషయంలో వారు చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అయ్యాయి. అయితే అసలు ఈ కోల్డ్ వార్ కి కొరటాల లేటెస్ట్ గా ఒక చెక్ పెట్టేసారు. దేవర ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

తమ ఇద్దరికీ ఎలాంటి విభేదాలు లేవని మొట్టమొదటగా శివ నువ్ బౌన్స్ బ్యాక్ అవుతాయని మెసేజ్ చేసిందే ఆయన అని మా ఇద్దరి మధ్య బంధాన్ని ఇంటర్వ్యూ లో మాటలని చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటూ కొరటాల శివ ఒక క్లారిటీ ఇచ్చారు. దీనితో గత కొన్నాళ్ల నుంచి ఉన్న అపోహలకు ఇపుడు క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు