Devara: ‘దేవర’ మాస్ రికార్డు.. రీసౌండ్ గ్యారెంటీ!

Devara: ‘దేవర’ మాస్ రికార్డు.. రీసౌండ్ గ్యారెంటీ!

Published on Sep 24, 2024 11:59 PM IST

ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా ఇది బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘దేవర’ చిత్రాన్ని ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే యూఎస్‌లో రికార్డులు మొదలుపెట్టిన ‘దేవర’ మిగతా దేశాల్లోనూ తన సత్తా చూపెడుతున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో ‘దేవర’ కోసం భారీ క్రేజ్ నెలకొంది. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో డాల్బీ అట్మోస్ సౌండ్‌తో అత్యధిక షోలు పడుతున్న ఇండియన్ సినిమాగా ‘దేవర’ మాస్ రికార్డు సాధించింది.

ఇక ఈ దేశాల్లోనూ ‘దేవర’ రీసౌండ్ చేయడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమాలో తారక్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండగా.. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు