Game Changer: “గేమ్ ఛేంజర్” రెండో సాంగ్ అప్డేట్ కి అప్డేట్ వదిలిన మేకర్స్

Game Changer: “గేమ్ ఛేంజర్” రెండో సాంగ్ అప్డేట్ కి అప్డేట్ వదిలిన మేకర్స్

Published on Sep 25, 2024 9:15 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ లేవు అనే సమయంలో ఎట్టకేలకు ఇక మేకర్స్ వరుస అప్డేట్స్ కి రంగం సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా నుంచి రెండో సాంగ్ గా మాస్ సింగిల్ గా సాలిడ్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు.

అయితే దీనిపై ఫైనల్ గా అవైటెడ్ క్లారిటీ వచ్చేసింది. చరణ్ పై మరో పోస్టర్ తో ఈ అవైటెడ్ సాంగ్ రా మచా మచా అంటూ సాగుతుంది అని రివీల్ చేశారు. దీనికి కూడా ఎలాంటి డేట్ అనేది రివీల్ చేయకపోవడం హైలైట్ అంశం. దీనితో మెగా ఫ్యాన్స్ చాలా ఒకింత డిజప్పాయింట్ అయ్యారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు తమ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా 50వ సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు