Devara: “దేవర” బుకింగ్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్

Devara: “దేవర” బుకింగ్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్

Published on Sep 25, 2024 10:07 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే తారక్ నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత సోలోగా వస్తున్న సినిమా ఇది కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇలా భారీ ధరలు అదనపు హైక్ గా ఇచ్చినప్పటికీ దేవర సత్తా చూపిస్తున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే డే 1 కి సెన్సేషనల్ బుకింగ్స్ దేవర కి నమోదు అవుతున్నాయి. ఇలా లేటెస్ట్ ట్రెండ్ ఒక్క హైదరాబాద్ సిటీ నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో 10 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. దీనితో టోటల్ రిపోర్టింగ్ గ్రాస్ గా అయితే దేవర నైజాం మార్కెట్ లో భారీ నంబర్స్ ని సెట్ చెయ్యడం ఖాయం అని చెప్పొచ్చు. మరి చూడాలి దేవర డే 1 వసూళ్లు ఏ లెవెల్లో ఉంటాయి అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు