Vettaiyan: వేట్టైయాన్ నుంచి హంటర్ ఎంట్రీ.. అదిరిపోయింది!

Vettaiyan: వేట్టైయాన్ నుంచి హంటర్ ఎంట్రీ.. అదిరిపోయింది!

Published on Sep 25, 2024 5:33 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్’(Vettaiyan) కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను రివీల్ చేశారు.

ఈ సినిమాలోని ‘హంటర్ ఎంట్రీ’ అంటూ సాగే సాంగ్‌కి సంబంధించిన ప్రివ్యూని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రజినీ పాత్రకు సంబంధించిన ఇంట్రో మనకు కనిపిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ల గురించి ఇచ్చే ఎలివేషన్ అదిరిందని అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నాడు.

‘వేట్టైయాన్’ మూవీలో ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ‘వేట్టైయాన్’ మూవీ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు