Devara: ‘బాహుబలి’ రేంజ్‌లో ‘దేవర’ క్లైమాక్స్..!

Devara: ‘బాహుబలి’ రేంజ్‌లో ‘దేవర’ క్లైమాక్స్..!

Published on Sep 25, 2024 7:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తారక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ డ్రామా మూవీలో తారక్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానుల్లో మూవీపై అంచనాల అమాంతం పెరిగిపోతున్నాయి.

అయితే, తాజాగా ‘దేవర’ సినిమాలోని క్లైమాక్స్‌కి సంబంధించి ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘దేవర’ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని.. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని.. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్‌ను ‘బాహుబలి’ రేంజ్‌లో తెరకెక్కించామని ఆయన చెప్పుకొచ్చారు.

‘బాహుబలి’ క్లైమాక్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘దేవర’ మూవీలోనూ ‘బాహుబలి’ తరహా క్లైమాక్స్ ఉంటుందని ఆయన తెలిపాడు. దీంతో ఈ సినిమా ఎలాంటి క్లైమాక్స్‌తో వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు