Pawan Kalyan: ప్రకాష్ రాజ్ పోస్ట్స్ పవన్ కోసమేనా!?

Pawan Kalyan: ప్రకాష్ రాజ్ పోస్ట్స్ పవన్ కోసమేనా!?

Published on Sep 26, 2024 1:07 PM IST


గత కొన్ని రోజులు నుంచి హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం నేషనల్ మీడియా అంతా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. మరి పవన్ కోలీవుడ్ యువ హీరో కార్తీ విషయంలో స్పందించిన తీరు ఆ అలాగే వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ విషయంలో కూడా మాట్లాడ్డం వంటివి వైరల్ గా మారాయి.

అయితే కార్తీపై చేసిన కామెంట్స్ కి తర్వాత వివరణ ఇవ్వడంతో అంతా సెటిల్ అయ్యిపోయింది. కానీ ప్రకాష్ రాజ్ తెలుగులో పెడుతున్న పోస్ట్స్ మాత్రం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వైరల్ గా మారాయి. నిన్ననే “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్…” అని పోస్ట్ చేయడంతో ఎక్కడా పవన్ పేరు లేకపోయినప్పటికీ అందరికీ ఇది పవన్, కార్తీ మ్యాటర్ కోసమే అని అర్ధం అయ్యింది.

ఇక లేటెస్ట్ గా “గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం…ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?” అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇందులో కూడా పవన్ పేరు ఎక్కడా లేదు కానీ పవన్ విషయంలో పరోక్షంగా మాత్రం ప్రకాష్ రాజ్ సెటైర్స్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి వీటిపై కూడా పవన్ నుంచి ఏమన్నా కౌంటర్ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు