సమీక్ష : ‘దేవర-1’ – ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : ‘దేవర-1’ – ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

Published on Sep 27, 2024 1:01 PM IST

Devara movie review

Devara Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 27, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు.
దర్శకుడు : కొరటాల శివ

నిర్మాత : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్

సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించాడు. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ :

ఎర్ర సముద్రం ప్రాంతంలో నాలుగు ఊర్లు ఉంటాయి. దేవర (ఎన్టీఆర్) ఓ ఊరికి అండగా ఉంటాడు. మరో ఊరికి భైర (సైఫ్ అలీ ఖాన్) పెద్దగా ఉంటాడు. మిగిలిన రెండు గ్రామాల వారితో కలిసి దేవర, భైర సముద్రం పై వచ్చే షిప్ ల్లో దోపిడీ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకి భైర బ్యాచ్ తో గొడవ జరుగుతుంది. అసలు దేవర దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు?, దేవర ఎవరకి కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి?, ఈ మధ్యలో దేవర కొడుకు వర (యంగ్ ఎన్టీఆర్‌ పాత్ర) ఎందుకు భయపడుతూ ఉంటాడు?, వరతో తంగం (జాన్వీ కపూర్) ప్రేమ కథ ఎలా సాగింది?, చివరకు దేవర కథ ఎలా ముగిసింది ?, దేవర కోసం వర ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటిలాగే, దేవర, వరద(వర) పాత్రల్లో కూడా ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ‘ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తి’గా ఎన్టీఆర్‌ నటించిన విధానం, నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

దేవర’తో తెలుగు తెరకు పరిచయం అయిన జాన్వీకపూర్‌ తన ‘తంగం’ పాత్రలో చాలా బాగా నటించింది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూడా ‘భైర’ పాత్రలో జీవించాడు. సైఫ్‌ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ పాత్రకు దీటుగా ఆయన పాత్రను కొరటాల శివ తీర్చిదిద్దారు. మరాఠీ నటి శ్రుతి మరాఠే చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా షైన్ టామ్ చాకో, అజయ్ మరియు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే అండర్‌ వాటర్‌ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్‌. ఆ వాటర్‌ సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా షార్క్‌ షాట్స్ చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టుగానే సముద్రంలో నడిచే యాక్షన్ సీక్వెన్స్‌ లను ఎఫెక్టివ్ గా డిజైన్‌ చేశారు. పైగా 90ల కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. కీలక సన్నివేశాల్లోని కలర్‌ టోన్‌ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక దేవర పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే సస్పెన్స్‌ బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు కొరటాల శివ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపారు.

 

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌.రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. కొరటాల శివ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ, కొన్నిచోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

 

తీర్పు :

విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ ఫుల్ నటన, కొరటాల దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఐతే, ఎన్టీఆర్ తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు