‘మట్కా’ సెట్స్‌లో నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్

‘మట్కా’ సెట్స్‌లో నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్

Published on Sep 27, 2024 1:00 AM IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే, నేడు నిర్మాత రామ్ తాళ్ళూరి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిత్ర షూటింగ్ సెట్స్‌లో నిర్మాత రామ్ తాళ్ళూరి బర్త్‌డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర యూనిట్. చిత్ర టీమ్ ఆయనకు కేక్ కట్ చేసి తమ విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు