35-చిన్న కథ కాదు.. ఓటీటీ అప్డేట్ వచ్చేస్తోంది!

35-చిన్న కథ కాదు.. ఓటీటీ అప్డేట్ వచ్చేస్తోంది!

Published on Sep 27, 2024 3:00 AM IST

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘35-చిన్న కథ కాదు’ మూవీ ఫీల్ గుడ్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నివేదా థామస్ లీడ్ రోల్‌లో నటించగా, నందకిషోర్ ఈమని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.

‘35 – చిన్న కథ కాదు’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా 35-చిన్న కథ కాదు చిత్ర ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వారు ఓ క్లూ ఇచ్చారు. ఈ సినిమాలో నివేదా కొడుకుని ‘జీరో’ అని పిలుస్తారు. దీంతో ‘‘ఎవరు ఈ జీరో..?’’ అనే ప్రశ్నతో ఈ సినిమా ఓటీటీ అప్డేట్‌పై అనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా ఆహా వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు