OG: “ఓజి” వైబ్ ని మిస్సవుతున్న పవన్ ఫ్యాన్స్..

OG: “ఓజి” వైబ్ ని మిస్సవుతున్న పవన్ ఫ్యాన్స్..

Published on Sep 27, 2024 8:11 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం దాదాపు పూర్తి అయ్యింది. అయితే ఈ సినిమా మేనియా పవన్ ఫ్యాన్స్ లో గట్టిగా ఉంది.

చాలా కాలం తర్వాత పవన్ నుంచి స్ట్రెయిట్ సినిమా ఇది కావడం పైగా సుజీత్ లాంటి డైరెక్టర్ తో పవన్ వర్క్ చేయడం అనేవి అభిమానులని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేసాయి. అయితే అన్నీ బాగుండి ఉంటే ఈరోజు సెప్టెంబర్ 27 థియేటర్స్ లో పవర్ స్టార్ “ఓజి” పడి ఉండేది. ఎప్పుడో మేకర్స్ ఈ డేట్ ని లాక్ చేసుకున్నారు కానీ పలు కారణాలు చేత సినిమా నేడు విడుదలకు నోచుకోలేదు.

దీనితో ఈరోజు ఓజి పడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది అని ఫ్యాన్స్ ఆ వైబ్ ని బాగా మిస్సవుతున్నారు. ఇక ఈ భారీ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడిపోయింది. మరి కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు