ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “భలే ఉన్నాడే”

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “భలే ఉన్నాడే”

Published on Sep 27, 2024 10:18 AM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రాలు రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ అయితే రిలీజ్ కి వచ్చాయి. అలా ఈ రెండు మూడు నెలల్లోనే మొత్తం మూడు రిలీజ్ లతో రాజ్ తరుణ్ రాగా తన నుంచి రీసెంట్ గా వచ్చిన మూడో చిత్రమే “భలే ఉన్నాడే”. దర్శకుడు శివసాయి వర్దన్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ని అందుకోలేదు.

అయితే ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం రానున్న అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. ఇక ఈ చిత్రంలో కొత్త నటి మనీష కందుకూర్ హీరోయిన్ గా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అలాగే మారుతీ టీం, రవికిరణ్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు