Devara: బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’కు మాసివ్ రెస్పాన్స్

Devara: బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’కు మాసివ్ రెస్పాన్స్

Published on Sep 27, 2024 2:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా, పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

కాగా, ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి కూడా సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ 2024‌లో ‘దేవర’ సినిమా ప్రీమియర్ వేశారు. ఈ ప్రీమియర్‌కు ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు. అక్కడ ‘దేవర’ మాస్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. థండరెస్ రెస్పాన్స్‌తో ‘దేవర’ చిత్రానికి జై కొట్టారు. తమ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విజయం అందుకున్నందుకు తారక్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక ఇండియాలోనూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా దూసుకెళ్తోంది. ఫ్యాన్స్ బెనిఫిట్ షోల నుంచే అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు