Devara: నార్త్ అమెరికా ప్రీమియర్స్‌లో ‘దేవర’ ఆల్‌టైమ్ రికార్డు

Devara: నార్త్ అమెరికా ప్రీమియర్స్‌లో ‘దేవర’ ఆల్‌టైమ్ రికార్డు

Published on Sep 28, 2024 12:00 AM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా, పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్ లభిస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ప్రీమియర్ షోలతో ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా కేవలం ప్రీమియర్ల రూపంలోనే ఏకంగా 2.834 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టినట్లుగా డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు.

దీంతో ఈ సినిమా నార్త్ అమెరికాలో ఆల్‌టైమ్ టాప్-3 ప్రీమియర్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేశాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు