డే 1 హిందీలో “దేవర” సర్ప్రైజింగ్ వసూళ్లు?

డే 1 హిందీలో “దేవర” సర్ప్రైజింగ్ వసూళ్లు?

Published on Sep 28, 2024 9:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “దేవర”. మరి పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి ఈ చిత్రాన్ని తీసుకురాగా డే 1 కి చాలా చోట్ల తారక్ భారీ రికార్డులు సెట్ చేసాడు. మరి అలాగే నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా తక్కువ బజ్ తోనే సాలిడ్ ఓపెనింగ్స్ కి దేవర ఇప్పుడు అందుకున్నట్టు తెలుస్తుంది.

దేవర డే 1 గా ఒక్క హిందీలోనే 7 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇది మాత్రం సర్ప్రైజింగ్ నెంబర్ అనే చెప్పాలి. కొంచెం మిక్స్డ్ టాక్ లో కూడా దేవర ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టడం అనేది ఇంట్రెస్టింగ్ అంశమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిగతా రోజుల వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు