ఇప్పుడు ‘జాన్వీ’ పరిస్థితి అదేనా ?

ఇప్పుడు ‘జాన్వీ’ పరిస్థితి అదేనా ?

Published on Sep 29, 2024 9:00 AM IST

దేవర సినిమాకు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే, హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ పాత్ర పై మాత్రం మిక్స్డ్ టాక్ ఉంది. ఆమె నటనకు కూడా అదే టాక్ ఉంది. నిజానికి ‘దేవర 1’లో తంగం పాత్ర తేలిపోయింది. జాన్వీ పాత్ర అతిథి పాత్రలాగే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ కి ‘జాన్వీ కపూర్’ కొత్త తెలుగు సినిమా పై ఫోకస్ పడింది. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నాడు.

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కి పెద్దగా స్క్రీన్ టైమ్ లేదు. పైగా ఉన్న సీన్స్ లో కూడా ఆమె నటన ఎలివేట్ కాలేదు. కాబట్టి, జాన్వీ కపూర్ ఇక చరణ్ సినిమా పైనే ఆశలు పెట్టుకోవడం మంచిది అని అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. పాపం జాన్వీ కపూర్, తన టాలీవుడ్ డెబ్యూ కోసం బాగా ఎదురు చూసింది. ఇప్పుడు, మళ్లీ చరణ్ సినిమా కోసం కూడా అంతకన్నా ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఆమెది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు