ఆ సీక్వెల్ లో ‘అనుష్క’ పాత్ర చాలా పవర్ ఫుల్‌ అట

ఆ సీక్వెల్ లో ‘అనుష్క’ పాత్ర చాలా పవర్ ఫుల్‌ అట

Published on Sep 29, 2024 5:46 PM IST

అనుష్క శెట్టి వరుసగా సినిమాలు చేయకపోయినా, ఇంకా ఆమె హీరోయిన్ రేసులోనే ఉంది. కాకపోతే, మిగతా హీరోయిన్లలా కాకుండా చాలా నిదానంగా సినిమాలు చేస్తున్నారు. బోలెడంత మార్కెట్ ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం తొందరపడట్లేదు. చేసేది లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అయినా వాటిలోనూ అనుష్క చాలా సెలెక్టెడ్ సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అయితే, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భాగమతి’ సినిమా 2018లో రిలీజై హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

కాగా త్వరలో దీనికి సీక్వెల్ రూపొందనుంది. డైరెక్టర్ అశోక్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ‘భాగమతి’ సీక్వెల్ లో అనుష్క చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తారని దర్శకుడు అశోక్ చెప్పుకొచ్చాడు. ఇక యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ ‘భాగమతి’ సీక్వెల్ మూవీ షూటింగ్ 2025 ప్రారంభంలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఐతే, మరోవైపు ఈ సినిమా గురించి మరో రూమర్ వినిపిస్తోంది. అనుష్క సినిమాకు ఓకే చెప్పినా.. ఇంకా కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, పూర్తిగా స్క్రిప్ట్ విని నచ్చితేనే అనుష్క సినిమాకి డేట్స్ కేటాయిస్తోందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు