ఇదేం ఉంది “ఓజి”, “గేమ్ ఛేంజర్” హై వేరే లెవెల్లో ఉంటుంది.!

ఇదేం ఉంది “ఓజి”, “గేమ్ ఛేంజర్” హై వేరే లెవెల్లో ఉంటుంది.!

Published on Sep 29, 2024 10:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రానున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి” అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” లు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకి కూడా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ నే సంగీతం అందిస్తుండగా తన నుంచి వచ్చిన బీట్స్ అయితే ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించాయి. మరి నిజానికి ఓజి నుంచి మొన్న పవన్ బర్త్ డే కే ఓ సాంగ్ రావాల్సి ఉంది కానీ రాలేదు.

మరి గేమ్ ఛేంజర్ నుంచి అయితే ప్రామిసింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో కూడా అదరగొట్టింది. మరి ఈ సినిమాల తాలుకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై థమన్ సాలిడ్ ప్రామిస్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ మాస్ స్కోర్ పై రిప్లై ఇస్తూ ఇదేం ఉంది ఓజి, గేమ్ ఛేంజర్ లు ఇవ్వబోయే హై వేరే లెవెల్లో ఉంటుంది. వెయిట్ చెయ్యండి అంటున్నాడు. అలాగే ఈ డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ తో రచ్చ లేపేద్దాం అని థమన్ ప్రామిస్ చేస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు