‘తండేల్’ నుంచి అద్భుతమైన శివరాత్రి పాట

‘తండేల్’ నుంచి అద్భుతమైన శివరాత్రి పాట

Published on Sep 30, 2024 12:09 PM IST

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఐతే, శ్రీకాకుళంలో శ్రీముఖలింగం అని ఓ పురాతన శివాలయం ఉంది. ఈ ఆలయంలో మహా శివరాత్రిని అపారమైన భక్తితో ఎంతో వైభవంతో గొప్ప పండుగగా నిర్వహిస్తారు. కాగా, ఈ ఆలయం ప్రేరణతో ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన.. ముఖ్యంగా మునుపెన్నడూ చూడని ఓ శివరాత్రి పాటను ప్లాన్ చేసింది తండేల్ టీమ్.

శివరాత్రి ఉత్సవాలను విస్మయపరిచేలా, పైగా అన్ని వయసుల వారికి కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉండబోతుంది. పైగా ఈ పాట కోసం విస్తృతమైన సెట్టింగ్‌ లతో పాటు భారీ నిర్మాణ విలువలతో ఈ పాటను చిత్రీకరించారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజింగ్, శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం ఈ పాటకు ప్లస్ కానున్నాయి. ఈ పాటలో నాగ చైతన్య – సాయి పల్లవిలతో పాటు వేలాది మంది డ్యాన్సర్‌ లు కూడా నటించారు. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన పాటగా ఈ పాట నిలిచిపోతుందట.

ఇక సాంగ్ షూట్ నుండి రెండు పోస్టర్లను కూడా మేకర్స్ విడుదల చేశారు. నాగ చైతన్య – సాయి పల్లవి ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు.ఈ తండేల్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు