ఇంటర్వ్యూ: శ్రీవిష్ణు – “స్వాగ్” లో ప్రతీ 20 నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉంటుంది

ఇంటర్వ్యూ: శ్రీవిష్ణు – “స్వాగ్” లో ప్రతీ 20 నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉంటుంది

Published on Oct 1, 2024 4:59 PM IST

తన ప్రతీ సినిమాకి ఏదొక వైవిధ్యతను ప్రదర్శిస్తూ అది కూడా కొత్త కంటెంట్ తో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు అనే చెప్పాలి. మరి ఇపుడు తాను హీరో ఆల్రెడీ తనకి “రాజ రాజ చోర” అనే హిట్ ని ఇచ్చిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి తో చేసిన మరో హిలేరియస్ ఎంటర్టైనరే ‘స్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

స్వాగ్ సినిమా గురించి, ఇందులో మీ రాజ్యం గురించి చెప్పండి ?

స్వాగ్.. అంటే స్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్ ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్ గా ‘స్వాగ్’ అని టైటిల్ పెట్టాం. స్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. అలాగే యంగ్ ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో వున్నాయి. సినిమా చూసి పేరెంట్స్ ని కూడా సినిమాకి తీసుకువెళ్తారు. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో వున్నాయి. మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది.

మీరు చేసిన పాత్రల్లో ఏది మీకు కష్టంగా అనిపించింది?

సింగ క్యారెక్టర్ కొంచెం ఈజీ అనిపించింది. మిగతా మూడు కష్టమైనవే. వాటి గెటప్, బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డిక్షన్ దేనికవే ప్రత్యేకం. రోజుకి నాలుగున్న గంటల సేపు మేకప్ వేసుకోవడం, మళ్ళీ దాన్ని తీయడానికి మరో రెండు గంటల సమయం పట్టడం.. ఇదంతా చాలా టఫ్. అయితే రేజర్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చిన అనుభూతి కలిగింది. అందరూ వందశాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు. కింగ్ ఎపిసోడ్స్ కి మోనో లాగ్స్ వున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టిస్ చేశాం. ఇందులో 90 ఇయర్స్ క్యారెక్టర్ కూడా వుంటుంది. అది చాలా బావొచ్చింది.

మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ గురించి ?

మీరా జాస్మిన్ గారు చాలా అద్భుతంగా చేశారు. 90లో మదర్ లాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు అందరి మదర్స్ గుర్తుకు వస్తారు. ఆ పాత్ర చాలా హుందాగా హోమ్లీ గా వుంటుంది. యునానిమస్ గా అందరికీ నచ్చుతుంది.

వివేక్ సాగర్ సంగీతం కోసం చెప్పండి?

వివేక్ తో బ్రోచేవారెవరురా, రాజ రాజ చేశాను, ఇది మూడో సినిమా. పాటలు సిట్యువేషన్ కి తగ్గట్టుగా వుంటాయి. బీజీఎం థియేటర్స్ లో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది.

మీ సినిమా ఆడియెన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు?

కొత్త కథ. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరిచే ట్విస్ట్ వుంటుంది. సర్ ప్రైజ్ లు వుంటాయి. ప్యూర్ కంటెంట్ సినిమా. పండగ సినిమాల్లో తప్పకుండా ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా.

ఇక ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతం ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఓ ఎంటర్టైనర్ కూడా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు