సెన్సార్ ముగించుకున్న ‘స్వాగ్’

సెన్సార్ ముగించుకున్న ‘స్వాగ్’

Published on Oct 1, 2024 6:46 PM IST

యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయగా, పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, అక్టోబర్ 4న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ‘స్వాగ్’ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ని అభినందించారట. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

‘స్వాగ్’ మూవీలో శ్రీ విష్ణు ఏకంగా 4 విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామలు రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్‌లతో పాటు గెటప్ శ్రీను, సునీల్, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు