Game Changer: ‘రా మచ్చా’ సెన్సేషన్.. ఫాస్టెస్ట్ రికార్డు సొంతం!

Game Changer: ‘రా మచ్చా’ సెన్సేషన్.. ఫాస్టెస్ట్ రికార్డు సొంతం!

Published on Oct 1, 2024 7:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేయగా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌గా ‘రా మచ్చా’ నిన్న రిలీజ్ అయ్యింది. ఈ పాటకు తమన్ సాలిడ్ మ్యూజిక్ బీట్స్ అందించాడు. దీంతో ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సిని మాలోని ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఈ పాట ఏంగా 19.5 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

ఇలా ఫాస్టెస్ట్ 19.5 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ పాట రికార్డును ఓ సరికొత్త పోస్టర్‌తో వెల్లడింాచారు. ఈ పాటలో చరణ్ సరికొత్తగా కనిపిస్తాడని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు