Devara: తెలుగు రాష్ట్రాల్లో “దేవర” 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్..

Devara: తెలుగు రాష్ట్రాల్లో “దేవర” 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్..

Published on Oct 2, 2024 11:58 AM IST

మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” ఇప్పుడు ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తుందో తెలిసిందే. మరి ఈ సినిమా మొత్తం 5 రోజుల రన్ ని వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ చిత్రం మన తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లు అందుకుంటుంది. ఇలా పి ఆర్ లెక్కల ప్రకారం మొదటిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదవ రోజు వసూళ్లు ప్రాంతాల వారీగా చూసినట్టు అయితే..

డే 5

నైజాం – 2.37 కోట్లు
సీడెడ్ – 1.22
వైజాగ్ – 0.58
తూర్పు గోదావరి – 0.29
వెస్ట్ గోదావరి – 0.24
కృష్ణ – 0.30
గుంటూరు – 0.29
నెల్లూరు – 0.26

నాల్గవ రోజు మొత్తం – 5.55 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

ఇక మొత్తం 5 రోజుల వసూళ్లు చూస్తే

నైజాం – 37.75 కోట్లు
సీడెడ్- 20.63 కోట్లు
వైజాగ్ – 10.21 కోట్లు
తూర్పు గోదావరి – 6.46 కోట్లు
వెస్ట్ గోదావరి- 5.15 కోట్లు
కృష్ణ- 5.79 కోట్లు
గుంటూరు – 8.73 కోట్లు
నెల్లూరు – 3.92 కోట్లు

ఇలా మొత్తం నాలుగు రోజుల్లో 98.64 కోట్ల రూపాయల షేర్ ని (జిఎస్టి కాకుండా) దేవర అందుకుంది. అలాగే నేడు గాంధీ జయంతి సెలవు కావడంతో ఈరోజు సగం రోజు పూర్తయ్యే సరికే 100 కోట్ల షేర్ ని దేవర కొట్టేస్తుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు