‘క’ రెండో సింగిల్ సాంగ్ అప్డేట్.. ఎప్పుడంటే?

‘క’ రెండో సింగిల్ సాంగ్ అప్డేట్.. ఎప్పుడంటే?

Published on Oct 2, 2024 8:08 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకులు సుజిత్, సందీప్‌లు డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రానుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికితోడు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ కూడా అంచనాలను క్రియేట్ చేశాయి.

కాగా, ఇప్పుడు ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘క’ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌కి సంబంధించిన అప్డేట్‌ను అక్టోబర్ 3న వెల్లడించబోతున్నట్లు ఓ పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ సినిమాలో ఓ భారీ జాతర సాంగ్ ఉందని, రెండో సాంగ్‌గా ఈ జాతర సాంగ్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు